ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. కొడుకు పుట్టుక తండ్రికి శాపంలా మారిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. భార్య ప్రసవించి రోజైనా గడవలేదు.. కన్నకొడుకును తండ్రి సరిగ్గా చూడను కూడా లేదు. అకాల మృత్యువు భర్తను అమాంతం మింగేసింది. జలగండం రూపంలో తండ్రి బలి అయ్యాడు. అప్పుడే పుట్టిన బిడ్డకు తండ్రి దూరమయ్యాడు. కన్నబిడ్డను మురిపెంగా చూపుదామనుకున్న భార్యకు భర్తని దూరం చేసింది. మనవడు పుట్టిన సంతోషంలో ఉన్న ముసలోళ్లకు.. కాలువలో మునిగి కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి తీరని విషాదంలో మునిగిపోయారు.