కన్నకొడుకు తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. కిరాతకంగా ఇనుప రాడ్‌తో ఇద్దర్ని కొట్టి చంపాడు.. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన కలకలంరేపింది. తాడేపల్లిగూడెం మండలం కడియద్దకు చెందిన రమేష్‌కు గతంలో వివాహమయ్యింది.. భార్య కొద్ది కాలం క్రితం అతడ్ని వదిలేసి వెళ్లిపోయింది. తర్వాత ఆమె అత్తారింటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి రమేష్ మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రులే అతడి బాగోగులు చూసుకుంటున్నారు.
ఏం జరిగిందో ఏమో రమేష్ ఇనుప రాడ్ తీసుకొని తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అతడి తల్లిదండ్రులు మార్తమ్మ, నాగేశ్వరరావులు అక్కడికక్కడే చనిపోయాడు. బాధితుల కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. రమేష్ అక్కడి నుంచి పారిపోవడానికి స్థానికులు గమనించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు రమేష్ కోసం గాలిస్తున్నారు. స్థానికుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు.