వీడు మనిషేనా ? కన్న తండ్రిని ఇలా !

son harassment her father assets

కనీ, గుండెలపై ఎత్తుకుని పెంచిన తండ్రికి ఓ వ్యక్తి ప్రత్యక్ష నరకం చూపించాడు. ఆస్తి మొత్తం తనకే రాసిచ్చేయాలన్న తన డిమాండ్ కు తండ్రి అంగీకరించకపోవడంతో సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా పెంపుడు కుక్కను ఆయన పై ఉసిగొల్పాడు. ఈ బాధను తట్టుకోలేని ఆ పెద్దాయన చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కొంతేరు పంచాయతీ లేతమామిడి తోటకు చెందిన లక్ష్మణదాసుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఆయన ఒంటరిగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు చిరంజీవి, కోడలు రజనీ లక్ష్మణదాసు ఇంట్లోనే ఉంటున్నారు.

west godavari latest news

లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన 5 సెంట్లతో పాటు మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్థలాన్ని తన పేర రాయాలని చిరంజీవి తండ్రి పై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఎటు పోయి ఎటు వస్తుందో అన్న అనుమానంతో ఇద్దరు కొడుకుల పేర్లపై చెరో 5 సెంట్ల భూమిని రాసేందుకు లక్ష్మణదాసు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ చిరంజీవి ఇందుకు ఒప్పుకోలేదు. మొత్తం భూమిలో ఏడున్నర సెంట్లు తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనికి తండ్రి అంగీకరించకపోవడంతో సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టారు. అయినా వాటన్నింటిని ఆ తండ్రి భరించాడు. చివరికి పెంపుడు కుక్కను ఆయనపై ఉసిగొల్పి వేధించడం ప్రారంభించారు. దీంతో సదరు పెద్దాయన తహసిల్దార్ వి. స్వామినాయుడిని ఆశ్రయించారు. తనకు సంబంధించిన స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల రాబడిని కూడా చిన్న కుమారుడు లాగేసుకుంటున్నాడని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన వినపత్రం సమర్పించారు. ఆయన పోలీసుల వద్దకు కేసు పంపగా ఇప్పుడు పోలీసులు చిరంజీవి బెండు తీసే పనిలో ఉన్నారు.