చైతూ, సామ్‌ల్లో ఎవరిది విజయం…?

Naga Chaitanya In Sailaja Reddy Alludu Clashing With Samantha U Turn

అక్కినేని జంట నాగచైతన్య మరియు సమంతలు నిన్న వినాయక చవితి సందర్బంగా తమ చిత్రాలు ‘శైలజారెడ్డి అల్లుడు’ మరియు ‘యూటర్న్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాల్లో ఏది పై చేయి సాధించింది అనే విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ఉంది. కొందరు సమంత యూటర్న్‌ చిత్రంకు మంచి స్పందన వస్తుందని చెబుతుంటే మరి కొందరు మాత్రం శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి అంటున్నారు. భారీ ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాల ఫలితాలపై మనం ఒక లుక్కేద్దాం.

sailaja-reddy-alludu-samant

నాగచైతన్య, మారుతిల కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రంపై మొదటి నుండి భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా రివ్యూవర్స్‌ ఈ చిత్రం యావరేజ్‌ అంటూ తేల్చి పారేశారు. అయితే సెలవు మరియు భారీ అంచనాలున్న కారణంగా భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే యూటర్న్‌ చిత్రం ఒక థ్రిల్లర్‌ చిత్రం అవ్వడంతో పాటు, పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కారణంగా కాస్త తక్కువ ఓపెనింగ్స్‌ నమోదు అయ్యాయి. అయితే సినిమాకు రివ్యూవర్స్‌ నుండి మంచి టాక్‌ దక్కింది. రివ్యూలు పాజిటివ్‌గా వచ్చిన నేపథ్యంలో సినిమా కలెక్షన్స్‌ లాంగ్‌ రన్‌లో పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

samantha-sailaja-reddy-allu