బిడ్డను చూసుకోలేని అభాగ్య తండ్రి: లారీతో మృత్యువాత….

Man Killed Her Brother For Bed

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి గణపవరంలో ఓ పోలీస్ పండంటి బిడ్డ పుట్టిన ఆనందంతో ఇంటికి వెళ్తున్నారు. ఆస్పత్రిలో పుట్టిన తన బిడ్డను, భార్యను చూసుకొనేందుకు ఆనందంగా వెళ్తున్న వ్యక్తిని మినీలారీ రూపంలో మృత్యువు వెంటాడింది. దాంతో ఆకుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదానికి సంబంధించి గణపవరం ఎస్సై ఎం.వీరబాబు కొన్ని వివరాలు తెలిపారు.

పశ్చమ గోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన చిట్టిమాని రాజు మంగళవారం ఉదయం తన ఆరేళ్ల కుమార్తె సాయిసంజనతో కలిసి మోటార్‌ సైకిల్‌పై భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నారు. ఆ సమయంలో గణపవరం మండలం చిలకంపాడు వద్ద తాడేపల్లిగూడెం నుంచి వస్తున్న మినీలారీ ఢీకొంది. లారీ చక్రం రాజు తలమీదుగా పోవడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా కుమార్తె సంజనకు గాయాలు కావడంతో తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.

కాగా భీమవరం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు భార్య అరుణ తాడేపల్లిగూడెంలోని ఒక ఆస్పత్రిలో ఈ మధ్యనే ప్రసవించింది. మంగళవారం ఈమెను ఆస్పత్రి నుంచి డిచార్జి చేస్తుండటంతో భార్యాబిడ్డలను చూడటానికి రాజు కుమార్తె సంజనతో కలిసి తాడేపల్లిగూడెం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎస్సై ఎం.వీరబాబు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.