ఛీటింగ్ కేసుపై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ

sonakshi sinha respond on cheating case

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై యూపీ పోలీసులు ఛీటింగ్ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో స్టేజీ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు గాను సోనాక్షి 24 ల‌క్ష‌లు అడ్వాన్స్ తీసుకుంద‌ని, కాని ఆ త‌ర్వాత కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదని ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ ప్ర‌మోద్ శ‌ర్మ ఆరోపించాడు. అంతేకాదు ఆమెపై మొరాదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా న‌మోదు చేశాడు. ఈ క్రమంలో మొరాదాబాద్ పోలీసులు ముంబైలోని జుహు పోలీసులను కేసు నిమిత్తం ఆశ్రయించారు.

యూపీ పోలీసులు సోనాక్షిపై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు న‌మోదు చేయ‌డంతో పాటు గురువారం సాయంత్రం ముంబైలోని జుహూలో ఉన్న సోనాక్షి ఇంటికి కేసు ద‌ర్యాప్తు చేసేందుకు వెళ్ళారు. ఆ స‌మయంలో ఆమె ఇంట్లో లేక‌పోవ‌డంతో మ‌రోసారి వెళ్లారు. ఈ విష‌యం తెలుసుకున్న సోనాక్షి త‌న ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఓ ఈవెంట్ ఆర్గనైజర్ తన పనిని సరిగ్గా నిర్వర్తించకపోగా.. నన్ను కేసులో ఇరికించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు అంటూ మండిపడింది. ఇంత వ‌ర‌కు మీడియా వర్గాల్లో తనకు ఎలాంటి మచ్చ లేదని.. తన టీం తనకు ఎంతగానో సహకరిస్తుందని.. విచారణ జరుగుతోందని.. ఇలాంటి మూర్ఖుల మాటలను నమ్మొద్దని మీడియా వర్గాలను కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్ర‌స్తుతం సోనాక్షి ద‌బాంగ్ 3 చిత్రంతో బిజీగా ఉంది. దీంతో పాటు కందానీ ష‌వాఖానా, మిష‌న్ మంగ‌ళ్‌, భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాల‌తో బిజీగా ఉంది.