వంద రోజులు పూర్తి చేసుకున్న మ‌జిలీ చిత్రం

majili movie completed 100 days

నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మ‌జిలి. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 5న విడుద‌ల అయిన ఈ చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. మండ‌పేట రాజార‌త్న కాంప్లెక్స్ థియేట‌ర్ లో ఈ మూవీ స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఇంత‌గా ఆదరించిన ప్రేక్ష‌కుల‌కి చిత్ర బృందం ధన్య‌వాదాలు తెలిపింది. మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ . వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. గోపి సుంద‌ర్ సంగీతం కూడా సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించింది. పెళ్ళి త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం.