నాగ చైతన్య ఫస్ట్ లుక్ – మజిలీ పీరియాడిక్ డ్రామానే

naga chaitanya first look in majili movie

అక్కినేని నాగ చైతన్య తన భార్య సమంత తో కలిసి పెళ్ళైన తరువాత తొలిసారిగా చేస్తున్న సినిమా ‘మజిలీ’. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, షైన్ సినిమా నిర్మిస్తుంది. నిన్ను కోరి అనే మంచి హిట్ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ని ప్రారంభించిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు అవ్వడంతో ఈ సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. గోపి సుందర్ మరోసారి శివ నిర్వాణ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. నాగ చైతన్య నుండి విడుదలైన గత రెండు సినిమాలు శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి పరాజయం పాలయ్యాయి.

కాబట్టి ఈ సినిమా విజయం నాగ చైతన్య కి అవసరమే కాకుండా వివాహం తరువాత సమంత తో నటిస్తున్న తొలి సినిమా కాబట్టి ఆ సెంటిమెంట్ ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా శివ నిర్వాణ పైన ఉంది.ఈరోజు నాగ చైతన్య పుట్టినరోజుని పురస్కరించుకొని, సినిమాలోని నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదలచేశారు. ఏ పోస్టర్లో గడ్డంతో, పాత వెస్పా బండిపై కూర్చున్న నాగ చైతన్య ఫస్ట్ లుక్ ని చూస్తుంటే ఈ మజిలీ సినిమా పీరియాడిక్ డ్రామా అని వినిపిస్తున్న వార్తలు నిజమని అనిపిస్తున్నాయి. అలా అని ఈ సినిమాలో ఈ పీరియాడిక్ ఎపిసోడ్ క్లైమాక్స్ లో వచ్చేది కాకుండా, సినిమా మొత్తం ఉంటే బాగుండు అని సినిమా అభిమానులు ఆశిస్తున్నారు.

image.png