లైంగిక వేధింపులు… ఇద్దరు భామలు ఢీ అంటే ఢీ…!

Sonam Kapoor Comments On Thanu Shree Dutta

గతంలో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ జరిగేదని బహిరంగ రహస్యం. ఇలాంటి విషయాలని ఎవరు బయట పెట్టకపోయేవారు. అందుకు వారి వారి వ్యక్తిగత కారణాలు ఉండేవి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కాస్టింగ్‌ కౌచ్‌ ఎంత వరకు ఉందో కానీ తారల ఆరోపణలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. పలువురు తారలు ఫలానా హీరో, దర్శకుడు, నిర్మాత అంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. దాంతో కాస్టింగ్‌ కౌచ్‌ను వాడుకున్న సినీ ప్రముఖులు లోలోపల హడలిపోతున్నారు. తెలుగులో కాస్టింగ్‌ కౌచ్‌ విషయం పెద్ద ధుమారం రేపినా బాలీవుడ్‌లో అది ఇంకా రగులుతూనే ఉంది. అగ్ర కథానాయిక కంగనా ఇది వరకే పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులపై పలు ఆరోపణలు చేసింది.

sonam-kapoor

తాజాగా కంగనా దర్శకుడు వికాస్‌ బెహ్ల్పై లైంగిక ఆరోపణలు చేసింది. తాను ‘క్వీన్‌’ చిత్రం చేసేటప్పుడు తరుచు సెక్స్‌ టాపిక్‌ తీసుకువచ్చే వాడని, చాలా మందితో వికాస్‌ లైంగిక సంబంధాలను తనతో చెప్పాడు, వికాస్‌ ప్రవర్తన వల్ల తాను చాలా విసిగిపోయాను అంటూ కంగనా చెప్పుకొచ్చింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద రచ్చ చేస్తున్నాయి. కంగనా వ్యాఖ్యలపై తాజాగా సోనమ్‌ కపూర్‌ స్పందించి.. కంగనా మాటలు నమ్మలేం, ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. దాంతో కంగనా ఆగ్రహానికి లోనయ్యి ఇతరులను ప్రేరేపించే స్థాయిలో తన మాటలు ఆదర్శంగా ఉంటాయని, తన మాటలపై స్పందించడానికి సోనమ్‌కు ఏ అర్హత ఉంది అంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా సోనమ్‌కు ఉన్నా ఫేమస్ అంతా కూడా తన తండ్రి అనిల్‌ కపూర్‌ వల్లనే కానీ సోనమ్‌ అంత మంచి నటి కూడా కాదు అంటూ సోనమ్‌పై నిప్పులు చెరిగింది. ఈ విధంగా ఒక దర్శకుడిపై లైంగిక ఆరోపణలు ఈ ఇద్దరు భామలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితిని తీసుకువచ్చాయి.

sonam-kapoor-thanusreee