ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్న సోనమ్‌ కపూర్‌

ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్న సోనమ్‌ కపూర్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది.ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖులు ముందస్తుగా హోం క్వారంటైన్‌కు పరిమితమవుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండాలని పలు దేశాలు నిబంధనలు విధించాయి. అయితే సినీ సెలబ్రిటీలు కొన్నిసార్లు సోషల్‌​ మీడియాలో నెటిజన్లు చేసే ట్రోలింగ్‌కు గురవుతారన్న విషయం తెలిసిందే.

తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ లండన్‌లో క్వారంటైన్‌ నింబంధనలు ఉల్లఘించారని, ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఓ నెటిజన్‌‌ ట్రోల్‌ చేశాడు. ఇటీవల సోనమ్‌ కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఫొటోను ఫోస్ట్‌ చేశారు. ‘అవుట్‌ డోర్‌ వర్కవుట్‌’ అనే కాప్షన్ కూడా ‌జతచేశారు. దీంతో ఆ ట్విటర్‌ యూజర్‌ సోనమ్‌ హోం క్వారంటైన్‌లో లేరని కామెంట్‌ చేశాడు.‌

సోషల్‌మీడియాలో తనపై వచ్చిన వ్యాఖ్యలపై సోనమ్‌ స్పందిస్తూ.. తాను పూర్తిగా ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు. ‘నేను మా సొంత తోటలో ఉన్నాను. అది మా ఇంటి పక్కనే ఉంటుంది మిత్రమా.. నేను పూర్తిగా నిర్భందంలోనే ఉన్నాను. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని విస్మరించాలి’ అని సోనమ్‌ ట్విటర్‌లో గట్టి కౌంటర్‌ ఇచ్చారు. గతవారం సోనమ్‌ కపూర్‌ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్ వెళ్లారు. సినిమాల విషయానికి వస్తే.. సోనమ్‌ కపూర్‌ చివరగా గతేడాది ‘ది జోయా ఫ్యాక్టర్’‌ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే.