సోనియా కూడా శ‌శిక‌పూర్ అభిమానే…

Sonia Gandhi’s Condolence Letter to Shashi Kapoor over Shakespearewallah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సోమ‌వారం మ‌ర‌ణించిన అల‌నాటి బాలీవుడ్ దిగ్గ‌జం శ‌శిక‌పూర్ కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో నివాళుల‌ర్పిస్తున్నారు. రొమాంటిక్ హీరోగా, బాలీవుడ్ స్ట‌యిల్ ఐకాన్ గా 1970, 80ల్లో హిందీ ప్రేక్ష‌కుల్ని ఓ ఊపు ఊపిన‌ శ‌శిక‌పూర్ కు సాధార‌ణ అభిమానులతో పాటు… పెద్ద సంఖ్య‌లో సెల‌బ్రిటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారిలో ఒక‌రు కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ. భర్త రాజీవ్ తో క‌లిసి శ‌శిక‌పూర్ సినిమాలు ఇష్టంగా చూసేవారు సోనియా. శ‌శిక‌పూర్ కు ఆమె వీరాభిమాని. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోనియానే చెప్పారు.

శ‌శిక‌పూర్ కు నివాళుల‌ర్పిస్తూ ఆయ‌న కుమార్తె సంజ‌నా క‌పూర్ కు సోనియా లేఖ రాశారు. శ‌శిక‌పూర్ చ‌నిపోయార‌ని తెలిసి చాలా బాధ‌ప‌డ్డాన‌ని సోనియా త‌న లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తంచేశారు. శ‌శిక‌పూర్ న‌టించిన షేక్స్ పియ‌ర్ వాలా చూసి ఆయ‌న‌కు అభిమానిన‌య్యాన‌ని సోనియా తెలిపారు. ఈ సినిమాను 1966లో ఇంగ్లండ్ లో చూసిన‌ట్టు గుర్తుఉంద‌ని సోనియా తెలిపారు. షేక్స్ పియ‌ర్ వాలా చూడ‌డం త‌న‌కు మ‌ర్చిపోలేని అనుభ‌వం మిగిల్చింద‌ని, దీనికి కార‌ణం సినిమా అద్భుతంగా ఉండ‌డం మాత్ర‌మే కాద‌ని, రాజీవ్ గాంధీ త‌న‌ను ఆ సినిమాకు తీసుకువెళ్ల‌డ‌మ‌ని సోనియా చెప్పారు. షేక్స్ పియ‌ర్ వాలా త‌ర్వాత శ‌శిక‌పూర్ న‌టించిన చాలా సినిమాలు చూశాన‌ని, ఆయ‌న గొప్ప న‌టుడ‌ని, వెండితెర‌పై అయినా…చిన్న ఆర్ట్ సినిమా అయినా…ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోతార‌ని ఆమె కొనియాడారు.త‌న‌ మ‌ధుర‌మైన సినిమాల‌న్నీ ఆయ‌న మ‌న‌కిచ్చిన గొప్ప కానుక‌ని సోనియా అన్నారు. శ‌శిక‌పూర్ ఎలాంటి పాత్ర కోస‌మైనా క‌ష్ట‌ప‌కే నేకాదు..ఎంతో మంది రాజ‌కీయ ప్ర‌ముఖులుకు శ‌శిక‌పూర్ అభిమాన హీరో.