టైమ్ ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ గా మీటూ ఉద్య‌మ మ‌హిళ‌లు

MeToo movement named Time magazine 2017 person of the year

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఏడాదిలో ఎక్కువ‌మందిపై ప్ర‌భావం చూపిన వ్య‌క్తుల‌ను కానీ, సంఘ‌ట‌న‌కు సంబంధించిన బృందాన్ని కానీ టైమ్ మ్యాగ‌జైన్ ప‌ర్సన్ ఆఫ్ ది ఇయ‌ర్ గా ఎంపిక చేస్తుంది. వారి ఫొటోను ముఖ‌చిత్రంగా ప్ర‌చురిస్తుంది. టైమ్ క‌వ‌ర్ పేజీపైకి ఎక్క‌డం చాలా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన విష‌యం. ఈ ఏడాది మీటూ ఉద్య‌మ‌కారిణిలు ఈ ఘ‌న‌త సాధించారు. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టెయిన్ చేతిలో వేధింపుల‌కు గుర‌యిన వీరంతా… త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని మీటూ యాష్ ట్యాగ్ ఉద్య‌మం ద్వారా ప్ర‌పంచానికి తెలియ‌జేశారు.

ఈ ఉద్య‌మాన్ని న‌డిపిన ఐదుగురు మ‌హిళ‌లు న‌టి యాష్లీ జుడ్, ఉబెర్ మాజీ ఇంజ‌నీర్ సూసెన్ ఫౌల‌ర్, అడామా ఇవూ, పాప్ గాయ‌ని టేల‌ర్ స్విఫ్ట్, ఇస‌బెల్ పాస్కుల్ ఫొటోల‌ను టైమ్ క‌వ‌ర్ పేజీపై ప్ర‌చురించింది. ఎంతో మందిని ప్ర‌భావితం చేసిన ఈ ఉద్య‌మాన్ని గుర్తిస్తూ ద సైలెన్స్ బ్రేక‌ర్ అని టైమ్ మ్యాగ‌జైన్ ప్ర‌చురించింది. మీ టూ ఉద్య‌మం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అనేక‌మంది మ‌హిళ‌లు త‌మకు ఎదుర‌యిన లైంగిక వేధింపుల‌ను బ‌య‌ట‌పెట్టారు. వారిలో బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఉన్నారు.

  MeToo movement named Time magazine 2017 person of the year