‘అజ్ఞాతవాసి’.. పవన్‌ షాకింగ్‌ నిర్ణయం

pawan agnathavasi movie audio launch has cancelled

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం వచ్చే నెలలో సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌ తాజాగా పూర్తి అయ్యింది. షూటింగ్‌ అంతా పూర్తి చేసి పవన్‌ ప్రస్తుతం ఏపీ పర్యటనలో బిజీగా ఉన్నాడు. మరో వైపు త్రివిక్రమ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను చేయించే పనిలో బిజీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలోని ఒక పాటను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. మరో రెండు మూడు రోజుల్లో రెండవ పాటను విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అమరావతిలో ‘అజ్ఞాతవాసి’ ఆడియో అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

pawan-kalyan

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం అమరావతిలోనే కాదు హైదరాబాద్‌లో కూడా జరుపబోవడం లేదు. పవన్‌ రాజకీయ బిజీ కారణంగా మరియు ఇతరత్ర కారణాల వల్ల ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను క్యాన్సిల్‌ చేయడం జరిగింది. సినిమా విడుదలకు వారం రోజుల ముందు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చేసే అవకాశం ఉంది. మొత్తానికి అజ్ఞాతవాసి ఆడియో విడుదల కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నిర్ణయం షాకింగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈనెల మూడవ వారంలో సినిమా ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉంది.