మీకు సైకిల్ కావాలా?.. రిక్షా కావాలా?

మీకు సైకిల్ కావాలా?.. రిక్షా కావాలా?

లాక్‌డౌన్ సమయంలో సినీనటుడు సోనూసూద్ చేసిన సాయం అతడిని రియల్ హీరోగా చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సాయం అనే ఆశ్రయించిన వారికి తనకు చేతనైనంత చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఆయన చేసిన సేవలకు మెచ్చి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అవార్డు కూడా ఇచ్చింది. మరోవైపు ఆయన చేస్తున్న సేవలను ఎగతాళి చేస్తూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నాడు. అయితే తనపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా తనకు వీలైనంత సాయం చేస్తూనే ఉంటానని సోనూసూద్ చెబుతున్నారు.

ఈ క్రమంలోనే పార్థ్ అనే ఓ నెటిజన్‌ సోనూకు వెరైటీ రిక్వెస్ట్ పెట్టాడు. ‘సార్ నాకు మాల్దీవులకు వెళ్లాలని ఉంది. సాయండి’ అని సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి తనదైన శైలిలో స్పందించిన సోనూ.. మీకు సైకిల్ కావాలా?.. రిక్షా కావాలా? అని కౌంటర్ వేశారు. ఆయన సమాధానంపై స్పందించిన నెటిజన్లు.. ‘సూపర్ రిప్లయ్ సార్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.