పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం

పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం

చిత్తూరు జిల్లా వెదురు కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. వెదురు కుప్పం మండలం యనమలమందకు చెందిన బాలికకు అదే గ్రామానికి చందిన పెరియ స్వామితో పెళ్లి జరిగింది. అయితే ఇది బాల్య వివాహం అని ఫిర్యాదు రావడంతో పోలీసులు.. పెళ్లికి సహకరించిన బాలిక మేనమామ బాబును పీఎస్‌కు పిలిచి ప్రశ్నించారు.. ఈ క్రమంలో బాబును పోలీసులు తీవ్రంగా కొట్టారని స్థానికులు చెబుతున్నారు. ఆగ్రహంతో గ్రామస్థులంతా పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు.

యనమలమంద నుంచి భారీగా తరలివచ్చిన స్థానికులు వెదురు కుప్పం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.. రోడ్డుకు రాళ్లు అడ్డంపెట్టి అక్కడే కూర్చున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.. కోపంతో ఊగిపోయిన గ్రామస్థులు పోలీస్ స్టేషన్ లోపలికి దూసుకెళ్లారు. లోపల ఉన్న ఫర్నీచర్, రికార్డులు, అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ అక్కడికి చేరుకుని వారికి సర్థిచెప్పి శాంతింపజేశారు. ఈ దాడి సమయంలో ఓ మహిళకు గాయాలుకాగా.. ఆస్పత్రికి తరలించారు.