దక్షిణాఫ్రికాను వరదలు ముంచెత్తాయి. డర్బన్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వరదల కారణంగా ఇప్పటివరకు 259 మంది మరణించారు. రోడ్లు, వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
క్వాజూలు నేటల్ రాష్ట్రంలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు బీభత్సం సృష్టించిన డర్బన్ ప్రాంతాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సందర్శించారు. ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమని పేర్కొన్నారు.