పార్ల్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. కాగా భారత్ నిర్ధేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ప్రోటిస్ సునాయాసంగా ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు వికెట్ల పడగొట్టడంలో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా విజయంలో ఓపెనర్లు మలాన్, డికాక్ కీలక పాత్ర పోషించారు.
కాగా పార్ల్ వేదికగా వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్ కావడం గమనార్హం. అంతకుముందు 2001లో శ్రీలంకపై 248 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా చేధించింది. ఇక టెస్ట్, వన్డే సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా.. కేప్ టౌన్ వేదికగా జనవరి 23న జరిగే చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.