పక్కటెముకల గాయం నుంచి స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఇంకా కోలుకోలేదు. దీంతో స్వదేశంలో ఈనెల 18 నుంచి జరిగే బార్సిలోనా ఓపెన్ టోర్నీకి అతడు దూరమయ్యాడు. కాగా బార్సిలోనా ఓపెన్‌లో రికార్డుస్థాయిలో 12 సార్లు విజేతగా నిలిచాడు నాదల్.
ఇక వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకల్లా నాదల్ కోలుకునే అవకాశముంది. 35 ఏళ్ల నాదల్ ఓవరాల్‌గా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవగా అందులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే 13 ఉన్నాయి.