“దేవర మూవీకి స్పెషల్ ఈవెంట్స్ ” ….!

"Special Events for Devara Movie" ....!
"Special Events for Devara Movie" ....!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది . ఐతే, ప్రస్తుతం తారక్ బ్రేక్ తీసుకొని కర్ణాటకలో ఆలయాల దర్శనంలో చాలా బిజీగా ఉన్నారు . తారక్ తిరిగి వచ్చాక, ఈ నెల రెండో వారం నుంచి దేవర ప్రమోషన్స్ లో కూడా పాల్గొనబోతున్నారు . ముందుగా హిందీలో కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అనంతరం అటు తమిళ ఇటు తెలుగులో ‘దేవర’ టీమ్ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ని , ఇంటర్వ్యూస్ ని ప్లాన్ చేస్తున్నారట.

"Special Events for Devara Movie" ....!
“Special Events for Devara Movie” ….!

ప్రస్తుతం ‘దేవర 1’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నది టీమ్. కాగా ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర మూవీ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ లో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ‘దేవర పార్ట్ 1’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ మూవీ ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో అనేది చూడాలి.