ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచరంలో మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆదివాసి గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం రూపొందించిన 10 అంశాలతో నల్లమల డిక్లరేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి , మంత్రులు ఆవిష్కరించారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు రూ.119 కోట్ల రుణాలు చెక్కు అందజేశారు. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దని గుర్తుచేశారు.
