ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యశ్వంత్‌పూర్‌–అహ్మదాబాద్‌ వారాంతపు రైళ్లు (06501/06502), యశ్వంత్‌పూర్‌–జయ్‌పూర్‌ వారాంతపు రైళ్లు (06521/06522), అజ్మీర్‌–బెంగళూర్‌ వారాంతపు రైళ్లు (06205/06206), బెంగళూర్‌–జోద్‌పూర్‌ వారాంతపు రైళ్లు (06533/06534), యశ్వంత్‌పూర్‌–ఢిల్లీ వారాంతపు రైళ్లు (06593/06594) యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు.