స్పైస్‌జెట్‌ విమానానికి తప్పిన ముప్పు

spicejet flight stopped at renigunta airport due to technical problem

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ బయల్దేరాల్సిన విమానానికి ముప్పు తప్పింది. రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే.. దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన పైలట్‌ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ఈ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తానికి ప్రమాదాన్ని ముందే పైలట్‌ పసిగట్టడంతో.. అటు ఎయిర్‌పోర్టు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.