అండర్-19 జింబాబ్వే బౌలర్ విక్టర్ చిర్వాను బౌలింగ్ నుంచి సస్పెండ్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా గత శనివారం పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో విక్టర్ చిర్వా బౌలింగ్ యాక్షన్ అనుమానాదాస్పదంగా ఉందంటూ అండర్-19 ఐసీసీ ప్యానెల్ పేర్కొంది. చిర్వా బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని తాము పరిశీలించామని ప్యానెల్ అధికారులు తెలిపారు.
ఐసీసీ రూల్స్‌లోని ఆర్టికల్ 6.7 ప్రకారం చిర్వా బౌలింగ్ యాక్షన్ అభ్యంతరకరంగా ఉండడంతో అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చిర్వా సస్పెన్షన్ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్యానెల్ తెలిపింది.