Sports: మెస్సీ 6 జెర్సీలకు 65 కోట్లు..!

Sports: 65 crores for Messi 6 jerseys..!
Sports: 65 crores for Messi 6 jerseys..!

ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ మెస్సీ ధరించిన 6 జెర్సీలు రూ. 65 కోట్లు పలికాయి. పలు క్రీడల్లో ఆటగాళ్ళకే కాదు వాళ్ళు ధరించే షూస్, దుస్తులు అన్నిటికీ డిమాండ్ ఉంటుంది. ఈ తరుణంలోనే.. గతేడాది వరల్డ్ కప్ లో ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ మెస్సీ ధరించిన 6 జెర్సీలు రూ. 65 కోట్లు పలికాయి. న్యూయార్క్ లో ఆన్లైన్ వేలం నిర్వహించగా…. ఓ అభిమాని వీటిని సొంతం చేసుకున్నారు.

ఇందులో కొంత మొత్తాన్ని మెస్సీ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న చిల్డ్రన్ ఆసుపత్రికి అందజేస్తారు. ఇది ఇలా ఉండగా, ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ ను పెనాల్టీ షూటౌట్ లో ఓడించి అర్జెంటీనా మూడో టైటిల్ ను గెలుచుకుంది. చివరి మ్యాచ్ లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 3-3తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ ను ఆశ్రయించారు. ఈ మెసేజ్ షర్టుల కోసం గెలిచిన బిడ్డర్ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.