ఈనెల 25న భారత్ – ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే మొదటి టెస్టుకు ముందే ఇంగ్లాండుకు పెద్ద షాక్ తగిలింది. భారత్ లో టెస్టు సిరీస్ గెలవాలనే పట్టుదలతో వస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రూపంలో పెద్ద షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అతడు ఈ సిరీస్ మొత్తానికి దూరమవుతాడని అని వెల్లడించింది.
అయితే బ్రూక్ ఫ్యామిలీలో ఏం జరిగిందనేది మాత్రం తెలియదు. ఈ విషయంలో గోప్యత పాటించాలని మీడియాను ఈసిబి కోరింది. త్వరలోనే బ్రూక్ స్థానంలో మరొక ఆటగాన్ని ఎంపిక చేస్తామని ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. గత 2 సంవత్సరాలుగా ఈ మిడిలార్డర్ బ్యాటర్ టెస్టులలో 91.76 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా 12 టెస్టులు ఆడిన హ్యారీ బ్రూక్.. ఏకంగా 62.15 యావరేజ్ తో 1,181 రన్స్ సాధించాడు.