Sports: అట్టహాసంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

Sports: Attahasanga National Sports Awards Ceremony
Sports: Attahasanga National Sports Awards Ceremony

దిల్లీలో రాష్ట్రపతి భవన్​ వేదికగా జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. వివిధ క్రీడల్లోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అర్జున అవార్డును అందుకున్నాడు. షమీతో పాటు చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.వైశాలీ, పిస్టల్‌ షూటింగ్‌ సెన్సేషన్‌ ఈషా సింగ్‌, రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌, బాక్సర్‌ మహమ్ముద్‌ హుస్సాముద్దీన్‌, పారా ఆర్చర్‌ సీతల్‌ దేవీ అర్జున అవార్డు అందుకున్నారు.

చెస్‌ క్రీడాకారుడు ప్రజ్ఞానందా కోచ్ ఆర్​బీ రమేశ్​ ద్రోణాచార్య పురస్కారాన్ని అందుకున్నారు. ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు సాత్విక్ సాయి రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం మలేషియా ఓపెన్ సూపర్ 1000లో ఆడుతున్నందున వాళ్లు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు.

2023 వన్డే ప్రపంచకప్‌లో షమి అసాధారణ ప్రదర్శన కనబరిచి ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 26 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్‌ (షూటింగ్‌), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), అజయ్‌కుమార్‌ రెడ్డి (అంధుల క్రికెట్‌)లకు ఈ అవార్డులు దక్కాయి.