బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. ఏడాది ఐపీఎల్ ను మార్చి 22 నుంచి మే 26 వరకు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఐపీఎల్ తేదీలను ప్రకటించాలని అధికారులు నిర్ణయించుకున్నారట.
అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 వరకు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. 26న ఐపీఎల్ ఫైనల్ ముగిస్తే, తొమ్మిది రోజుల వ్యవధిలోనే టీ20WCకు ఆటగాళ్లు సిద్ధం కావాల్సి ఉంటుంది.
ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ గురించి ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. టాటా గ్రూప్ సంస్థ ఐపిఎల్ టైటిల్స్ స్పాన్సర్ గా… మరో నాలుగు ఏళ్ల పాటు కొనసాగనుంది. మొదట 2022 మరియు 2023 రెండు సంవత్సరాల పాటు టాటా సంస్థ ఐపిఎల్ టైటిల్స్ స్పాన్సర్ గా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తాజాగా 2028 వరకు ఈ ఒప్పందాన్ని పొడిగించినట్లు తెలుస్తోంది.
దీనికోసం టాటా ఏటా… 500 కోట్లు బీసీసీఐ పాలకమండలికి చెల్లించనున్నట్లు తెలుస్తోంది.అంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కుల కోసం ప్రతి సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్న టాటా గ్రూప్.. 2024-2028 వరకు 5 సంవత్సరాల కాలంలో 2500 కోట్లు బీసీసీఐకి చెల్లించడానికి టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది.