Sports: ముంబయి ఇండియన్స్​కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు సూర్యకుమార్ దూరం..!

Sports: Big shock for Mumbai Indians.. Suryakumar away from IPL..!
Sports: Big shock for Mumbai Indians.. Suryakumar away from IPL..!

ఐపీఎల్ మొదలు కాకుండానే ముంబయి ఇండియన్స్​కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీమ్ లో ఇప్పటికే కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో గట్టి షాక్ తగలనుంది. ఆ టీమ్​కు సంబంధించిన స్టార్ క్రికెటర్​ సూర్య కుమార్ జట్టుకు దూరం కానున్నట్లు సమాచారం. అయితే సీజన్ మొత్తం దూరమవుతాడా లేక కొన్ని మ్యాచులకేనా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ హెర్నియా అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతడ గాయం కారణంగా టీమ్ ​ఇండియాకు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 సిరీస్‌లోనూ సూర్యకు చీలమండలానికి గాయమైంది. ప్రస్తుతం ఈ గాయాలకు సూర్య చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి నెమ్మదిగా కోలుకుంటున్న సూర్య హెర్నియా సమస్యను పూర్తిగా తొలగించుకునేందుకు ఓ సర్జరీ చేయించుకోనున్నాడు. మరికొన్ని రోజుల్లో విదేశాల్లో సూర్యకుమార్ ఆపరేషన్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయట. సర్జరీ తర్వాత సూర్య కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఐపీఎల్​కు అతడు దూరమయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.