రేపటి నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ జరుగనుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యా డు. ఎడమ కాలు చీలమండలో గాయం కారణంగా జట్టు నుంచి లుంగి ఎంగిడి తప్పు కున్నా డు. దీం తో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రెండేళ్ల తర్వాత బ్యూరాన్ హెండ్రిక్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యూరాన్ హెండ్రిక్స్ చివరిసారిగా 2021లో సౌతాఫ్రికా తరఫున ఆడాడు. హెండ్రిక్స్ తన కెరీర్లో ఇప్పటివరకు ఒక టెస్టు, ఎనిమిది వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
అయితే, భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడకు కూడా విశ్రాంతినిచ్చింది. దీంతో సఫారీ జట్టు బౌలింగ్ కి గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బెర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్, లిజార్డ్ విలియమ్స్ సారథ్యం వహించనున్నారు. ఇక, భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులో మొదటి మ్యాచ్ డర్బన్‌లో జరగనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు డిసెంబర్ 12, డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతాయి. మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన తర్వాత రెండు జట్లు డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడు ODI మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి రెండు జట్లు రెండు టెస్ట్ మ్యాచ్‌లు తలపడతాయి.