తిలక్ వర్మ, రింకు సింగ్ లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఇంగ్లాండ్ లయన్స్ తో ఆఖరి రెండు మ్యాచ్ లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారధ్యంలో లయన్స్ తో పోటీపడనున్న ఈ టీంలో తిలక్ వర్మ, రింకు సింగ్ లకు కూడా చోటు దక్కింది. కాగా, భారత్ యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లాండ్ యువ టీం ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12-13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది.
ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’ ఇంగ్లాండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్ట్ మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే….జనవరి 24-27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1-4 వరకు మూడో అనధికారిక టెస్ట్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ లయన్స్ తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.