హీరోకు అమ్మ స్పోర్ట్స్ కారు కానుక…

Sports Car Gift To Naga Shourya By His Mother Usha For Chalo Success

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పలు చిత్రాలతో హీరోగా టాలీవుడ్‌లో గుర్తింపు దక్కించుకున్న నాగశౌర్య సక్సెస్‌లను మాత్రం దక్కించుకోలేక పోయాడు. ఎట్టకేలకు ‘ఛలో’ చిత్రంతో నాగశౌర్యకు విజయం దక్కింది. ‘ఛలో’ చిత్రాన్ని నాగశౌర్య తల్లి ఉషా స్వయంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నిర్మించారు. పెట్టిన పెట్టుబడిని డబుల్‌ లాభాలు రావడంతో నాగశౌర్య తల్లి చాలా హ్యాపీ అయ్యారు. భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దర్శకుడు వెంకీ కుడుములకు ఉషా కారు బహుమానంగా ఇచ్చారు. తాజాగా మరోసారి ఉషా కారు గిఫ్ట్‌గా ఇచ్చి వార్తల్లో నిలిచారు. 

ఈసారి తన కొడుకు నాగశౌర్యకు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చి ఉషా వార్తల్లో నిలిచారు. యువ హీరోల్లో చాలా మంది ఆసక్తి చూపించే స్పోర్ట్స్ కారును నాగశౌర్యకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ బహుమానంతో నాగశౌర్య ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ రెండు చిత్రాలు కూడా ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోసారి కొడుకుతో సినిమాను నిర్మించేందుకు ఉషా కథలు వింటున్నారు. త్వరలోనే ఒక మంచి కథను ఫైనల్‌ చేసి సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.