దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ కి ముందు న్యూజిలాండ్ కి ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ గాయం కారణంగా సఫారీలలో రెండో టెస్ట్ కి దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్ లో మిచెల్ కాలి బొటన వేలికి గాయమైంది. అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండో టెస్ట్ కి జట్టు మేనేజ్ మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని బౌలింగ్ ఆల్ రౌండర్ విల్ ఓ రూర్క్ తో న్యూడిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది.
మిచెల్ తన గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వదేశంతో ఆసీస్ తో జరిగే టీ 20 సిరీస్ కు కూడా మిచెల్ దూరయ్యే అవకాశముంది. బ్యాక్ క్యాప్స్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ.. మిచెల్ మూడు ఫార్మాట్లలో మా జట్టులో కీలక ఆడగాడు. అతడు గాయపడటం టీమ్ కి నష్టమేనని తెలిపారు. రాబోయే సిరీస్ లను దృష్టిలో ఉంచుకొని అతన్నిరిహాబిలిటేషన్ కి పంపించాం. తరువాత మ్యాచ్ లకు అతను పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్టు తెలిపారడు. ఐపీఎల్ కి ముందు మిచెల్ గాయం చెన్నై సూపర్ కింగ్స్ కి కాస్త ఆందోళన కలిగిస్తోంది.