ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చెన్నై తలపడనుంది. మొదట 21 మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.
చెన్నై జట్టు తొలి మ్యాచ్‌ని తొమ్మిదోసారి ఆడనుంది. ఇంతకుముందు, జట్టు 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022, 2023లో ప్రారంభ మ్యాచ్‌ను ఆడింది. అయితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో ఎలాగైనా కప్ కొట్టాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతో ఆతృతగా చూస్తోంది. ఇందులో భాగంగానే.. కమిన్స్ ను కొత్త కెప్టెన్ చేయాలని కావ్యా మారన్ నిర్ణయం తీసుకున్నారట. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.