Sports: IPL 2024లో లక్నోపై ఘన విజయం సాధించిన ఢిల్లీ

Sports: Delhi has a big win over Lucknow in IPL 2024
Sports: Delhi has a big win over Lucknow in IPL 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా నిన్న లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 26 వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్ లో ఢిల్లీ ఓపెనర్లు మొదటి వికెట్ కు 24 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పృద్వి షా 33, డేవిడ్ వార్నర్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఢిల్లీ బ్యాటర్లలో రిషబ్ పంత్, జేక్ ఫ్రీజర్ కలిసి మూడో వికెట్ కు 77 పరుగులు జత చేశారు. జేక్ ఫ్రీజర్ 35 బంతుల్లో 55 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. చివర్లో స్టబ్స్ 15, హోప్ 11 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.

కాగా, మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 39, డికాక్ 19 రన్స్ చేసి తొలి వికెట్ కు 20 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పడిక్కల్ 3, స్టాయినిస్ 8 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఇక వెస్టిండీస్ ఆటగాడు పూరాన్ డక్ అవుట్ అయ్యాడు. చివర్లో ఆయుష్ బదోని 35 బంతుల్లో 55 పరుగులతో అదరగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.