Sports: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ భవితవ్యంపై చర్చ

Sports: Discussion on the fate of Chennai Super Kings captain Dhoni
Sports: Discussion on the fate of Chennai Super Kings captain Dhoni

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరుగనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లూ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాయి.

ఎప్పటిలానే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ భవితవ్యంపై చర్చ కూడా ప్రారంభమైంది. ఇదే అతడికి ఆఖరి సీజనా..?అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఈనేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్‌ దీపక్‌ చాహర్‌ ఈ అంశంపై స్పందించాడు.”గత ఏడాది 145 కి.మీ. వేగంతో వచ్చిన బంతులను ఎమ్మెస్ ధోనీ ఎలా సిక్స్‌లుగా మలిచాడో మీరు చూశారు. మేం దానిని నెట్స్‌లోనూ చూస్తాం. ధోనీ ఈ సంవత్సరం ఆడతాడు. ఈ సీజన్‌ అనంతరం అతడు నిర్ణయం తీసుకోవచ్చు అని అన్నారు. అయితే.. మరో రెండు సంవత్సరాలు ఆడతాడని నేను అనుకుంటున్నాను’ అని చాహర్‌ తెలిపారు.