ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా నిన్న హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్స్ నమోదు అయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాటర్లలో హెడ్ సెంచరీ చేయగా క్లాసెన్ హాఫ్ సెంచరీ తో మెరిశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు గెలిచినంత పని చేసింది. నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 42, డూప్లెసెస్ 62 పరుగులు చేశారు. మిడిల్ లెటర్ విఫలమైనప్పటికీ దినేష్ కార్తీక్ ఒక్కడే 35 బంతుల్లో 83 పరుగులు చేసి గెలిపించే ప్రయత్నం చేశాడు. అప్పటికి ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరగడంతో బెంగళూరు గెలవలేకపోయింది. దీంతో డీకే పోరాటం వృధా అయిపోయింది.