యంగ్ వికెట్ కీపర్, ప్లేయర్ ఇషాన్ కిషన్ కెరీర్ ప్రశ్నగా మారింది. గత కొన్నాళ్లుగా జట్టుకు సెలెక్ట్ అవుతున్నాడు కానీ ఆడే అవకాశాలు మాత్రం ఇషాన్ కిషన్ కి పెద్దగా రావడం లేదు. వరల్డ్ కప్ తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌ల కి ఇషాన్ కిషన్ ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. తుది జట్టులో మాత్రం ఒకటి, రెండు అవకాశాలు తప్ప మీరేమి పెద్దగా రాలేదు. సో, బీసీసీఐ తీరుపై ఇషాన్‌కిషన్ అసంతృప్తిగా ఉందని టాక్. అవకాశాలు రాకపోవడంతో మానసికంగా కూడా కృంగిపోయినట్లు తెలుస్తోంది.
అయితే ఒత్తిడిని తట్టుకోలేకే అప్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్‌లో ఇషాన్‌కిషన్‌కు ఛాన్స్ వచ్చింది. కానీ 11 మ్యాచ్‌లకు రెండు మ్యాచుల్లోనే ఇషాన్‌కిషన్ బరిలో దిగాడు. శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాక టీమ్ మేనేజ్మెంట్ అతడిని పక్కనపెట్టింది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, అప్ఘనిస్థాన్ వంటి చిన్న జట్లతో కూడా ఆడించలేదు. మానసిక సమస్యల పేరు చెప్పి అప్ఘనిస్థాన్‌తో సిరీస్ సెలక్షన్‌కు దూరం అయ్యి వెకేషన్ కి వెళ్ళాడు. దీనితో అతని మీద వేటుపడే అవకాశం వుంది.