Sports: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త… టి20 ల్లోకి రీ ఎంట్రీ!

Sports: Good news for Rohit Sharma fans... re-entry into T20!
Sports: Good news for Rohit Sharma fans... re-entry into T20!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ టి20లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో టి20 సిరీస్, వచ్చే టి20 WCలో రోహిత్ భారత జట్టును నడిపిస్తారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. విరాట్ కోహ్లీ సైతం టి20లు ఆడతారని తెలిపింది. కాగా, గతేడాది టి20 ప్రపంచకప్ ఓటమి తర్వాత విరాట్, రోహిత్ టి20లు ఆడట్లేదు.

ఇక తాజాగా ఇండియన్ టీం గురించి మరియు సారధి రోహిత్ శర్మ గురించి తెలంగాణ రాజకీయ నాయకుడు మరియు AIMIM చీఫ్ అసదు ద్దీన్ ఒవైసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒవైసి మాట్లాడుతూ రోహిత్ శర్మ ప్రపంచకప్ లో టీం ఇండియాను అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ సారథ్యంలో బ్యాట్స్మన్ లు మరియు బౌలర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ ఒవైసి పొగిడారు .