Sports: జై సింహా తీరుపై HCA ఆగ్రహం.. కోచ్‌ పదవి తొలగింపు

Sports: HCA angered by Jai Simha's behavior.. Removal of coach's post
Sports: HCA angered by Jai Simha's behavior.. Removal of coach's post

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళ క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ జైసింహా డ్రింక్ చేస్తున్నాడు. మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు జైసింహా. అయితే…జైసింహాకు అడ్డు చెప్పకుండా పూరిమ రావు ఎంకరేజ్ చేశాడు.

నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి విజయవాడ కు మ్యాచ్ ఆడేందుకు విమెన్స్ క్రికెట్‌ టీమ్ వెళ్ళింది. అయితే..రిటర్న్ లో ఫ్లైట్ కి రావాల్సి ఉండగా… కావాలనే డిలే చేశాడు కోచ్ జైసింహా. దీంతో వారందరూ బస్సులో వచ్చారు. ఇక బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన జై సింహా..వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పూర్ణిమ రావుతో జై సింహాలపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే.. జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు.