Sports: ఐపీఎల్ వేలం చరిత్ర తిరగరాసిన స్టార్క్ కి ఎంతంటే..?

Sports: How much for Starc who rewrote the history of IPL auction..?
Sports: How much for Starc who rewrote the history of IPL auction..?

ఆస్ట్రేలియా పేస‌ర్ మిచెల్ స్టార్క్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయి. ధ‌ర పెరిగిపోవ‌డంతో మిగిలిన ఫ్రాంచైజీలు ప‌క్క‌కు త‌ప్పుకోగా అధిక ప‌ర్స్ వాల్యూ ఉన్న గుజ‌రాత్ టైటాన్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఎలాగైనా అత‌డిని సొంతం చేసుకోవాల‌ని భావించాయి.

ఈ క్ర‌మంలో అత‌డి ధ‌ర అమాంతం పెరిగింది. చివ‌ర‌కు అత‌డిని రూ. 24.75 కోట్ల‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ అత‌డిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఇదే అత్య‌ధిక ధ‌ర కావ‌డం గ‌మ‌నార్హం. ఇదే వేలంలో ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ.20.50 కోట్ల‌కు ద‌క్కించుకుని చ‌రిత్ర సృష్టించ‌గా మిచెల్ స్టార్స్‌ ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధిక ధర రికార్డు ఇంగ్లండ్ యువ ఆల్ రౌండర్ శామ్ కరన్ పేరిట ఉంది. 2023 సీజన్ కోసం శామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు రికార్డును ప్యాట్ కమిన్స్ బద్దలుకొట్టగా.. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కమిన్స్ రికార్డును స్టార్క్స్ బద్దలుకొట్టాడు.