ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. తొలి T-20 మ్యాచ్ విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. ప్రపంచ కప్ ఫైనల్లో మనల్ని ఓడించిన ఆస్ట్రేలియాను 5-0తో ఓడించాలని భారత అభిమానులు కోరుతున్నారు. కాగా, ఈ సిరీస్ లో భారత జట్టు సీనియర్లు లేకుండా బరిలోకి దిగనుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తారు.
జట్టు వివరాలు:
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w/c), సీన్ అబాట్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్సన్ ఆరోన్ హార్డీ.
భారత్ జట్టు: ఇషాన్ కిషన్(w), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, రింకూ సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్.