Sports: హాకీ సెమీఫైనల్లో జర్మనీతో అమీతుమీ తేల్చుకోనున్న భారత్

Sports: India will face Germany in the semi-finals of hockey
Sports: India will face Germany in the semi-finals of hockey

జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్లో జోరుమీదున్న భారత్ అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం సెమీఫైనల్లో పటిష్టమైన జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్స్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్ ను 4-3తో చిత్తుచేసిన భారత్పై సెమీస్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రథమార్ధంలో 0-2తో వెనుకంజలో ఉండి.. మూడో క్వార్టర్స్లో 2-3తో ఉన్న భారత్ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. మరో మూడు నిమిషాల్లో మ్యా చ్ ముగుస్తుందనగా గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించిన కెప్టెన్ ఉత్తమ్ సింగ్ మంచి ఫామ్లో ఉండటం భారత్కు సానుకూలాంశం . నెదర్లాండ్స్ పై రెండు గోల్స్ తో అదరగొట్టిన వైస్ కెప్టెన్ అరిజీత్ సింగ్ హుండాల్ జట్టుకు కొండంత బలం. అయితే ఈ ఏడాది జర్మనీతో 4 సార్లు తలపడిన భారత్.. నాల్గింట్లోనూ ఓడటం అతిపెద్ద ప్రతికూలాంశం. మరో సెమీస్లో స్పెయిన్తో ఫ్రాన్స్ తలపడుతుంది.