సౌత్ ఆఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్ టీం తో మూడు టి20 మ్యాచ్ లలో తలపడనుంది. వచ్చే ఏడాది జరగబోయే టి20 ప్రపంచ కప్పుకి ముందు భారత్ ఆడబోయే చివరి టి20 సిరీస్ ఇదే. ఇదిలా ఉంటే భారత టి20 కెప్టెన్లు సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండే ,ఋతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే గాయాల కారణంగా ఇండియా జట్టుకి దూరమైన సంగతి తెలిసిదే. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టి20 సిరీస్ కి ఎవరిని కెప్టెన్ గా నియమించాలి అనే విషయంపై సందిగ్ధంలో ఉన్నది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మళ్లీ రోహిత్ శర్మని కెప్టెన్ గా నియమించునున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2022 టి20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు.
జట్టుకు ఎవరు నాయకత్వం వహించాలో సెలెక్టర్లు నిర్ణయిస్తారని మేము సుదీర్ఘంగా రోహిత్ తో చర్చలు జరిపాము. అయితే రోహిత్ కూడా సారత్య బాధ్యతలు చేపట్టడానికి సుముఖంగా ఉన్నట్లు, దీంతోపాటు ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ప్రాధాన్యం ఉంది. దీని గురించి కూడా రోహిత్ తో అజిత్ అగర్కర్ మాట్లాడతాడని బీసీసీఐ అధికారి వెల్లడించారు.