ఆస్ట్రేలియా జట్టు చేతిలో మరోసారి భారత్ కు ఓటమి ఎదురైంది. నిన్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జెట్ల మధ్య 3వ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా చేతిలో 5వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్… నిర్మిత 20 ఓవర్లలో 3వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది.
భారత్ బ్యాటర్లలో… రుద్దురాజు గైక్వాడ్ 123 పరుగులు చేసి రాణించాడు. టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ రాణించకపోయినా, రుతురాజు గైక్వాడ్ భారత్ కు భారీ స్కోర్ అందించాడు. అయితే 223 పరుగుల భారీ లక్ష్యంతో, చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట తడబడింది. కానీ ఆ తర్వాత విజృంభించి ఆడింది. ఈ నేపథ్యంలోని నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఈ సిరీస్ లో 2-1 ఆధిక్యంతో భారత్ ముందంజలో ఉంది. ఇంకా రెండు టీ20 మ్యాచ్ లు ఉన్నాయి.