ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన కేఎల్ రాహుల్ కోలుకున్నారు. ఇవాళ నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దీంతో అతను ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ ఆడటం ఖాయమని తెలుస్తోంది.
కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టులో లేని పరిస్థితిలో కేఎల్ ఎంట్రీ భారత్ కు శుభవార్తెనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మూడో టెస్టులో రవీంద్ర జడేజా ఆడటంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అటు ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరగబోయే మూడో టెస్టు కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై నుంచి రాజ్కోట్ బయల్దేరి వెళ్లారు.
మిగతా ఆటగాళ్లు రేపు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా మరో రెండు రోజుల్లో అబుదాబి నుంచి భారత్ కు తిరిగిరానున్నట్లు సమాచారం. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో ఇరుజట్లు చెరొక విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమం అయింది.ఇక మూడో టెస్ట్ భారత్ ,ఇంగ్లాండ్ మధ్య ఈనెల 15 నుంచి రాజ్కోట్ వేదికగా మొదలుకానుంది.