గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్పు లో చివరి మ్యాచ్ ఆడిన షమీ అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.జనవరి చివరి వారంలో లండన్ కి వెళ్లి చీలమండకు ప్రత్యేకమైన ఇంజెక్షన్ తీసుకున్నా షమీ మూడు వారాల తర్వాత లైట్‌గా రన్నింగ్ మొదలుపెట్టాడు. కానీ ఇంజెక్షన్ పని చేయలేదు. ఫిబ్రవరిలో లండన్‌లో చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి టీమిండియా స్టార్ పేసర్ షమీ హెల్త్ అప్డేట్ ఇచ్చారు.’అందరికీ నమస్కారం. నా రికవరీ ఎంత వరకు వచ్చిందో చెప్పాలని అనుకుంటున్నా. శస్త్రచికిత్స పూర్తయి 15 రోజులు అవుతోంది అని పేర్కొన్నారు. ఇటీవలే ఆపరేషన్ చేసిన చోట కుట్లు తొలగించారు. ఇంత వేగంగా కోలుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
పూర్తిగా కోలుకునేందుకు ఎదురుచూస్తున్నా’ అని పేర్కొంటూ ఆస్పత్రిలోని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా మహమ్మద్ షమీ షేర్ చేశారు. కాగా, మహమ్మద్ షమీ ఐపీఎల్ 17వ సీజన్ కి దూరం అయ్యాడు. అంతే కాకుండా మహమ్మద్ షమీ జూన్ లో జరగబోయే పొట్టి ఫార్మాట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.