Sports: నడవలేని స్థితి వరకు ఐపీఎల్ ఆడుతా: మాక్స్ వెల్

Sports: Played IPL till unable to walk: Maxwell
Sports: Played IPL till unable to walk: Maxwell

Maxwell: జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్ ల్లో ఆడతానని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యా క్స్ వెల్ అన్నాడు. ఆసీస్ ప్రపంచకప్ విజయం లో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల మ్యాక్స్ వెల్ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ‘‘బహుశా నా కెరీర్లో ఆడే చివరి టోర్నీ ఐపీఎల్ కావొచ్చు . నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్లో ఆడతా. డివిలియర్స్, విరాట్ కోహ్లీతో కలిసి భుజాలు కలపడం .. వారితో మాట్లాడుతూ మిగతా వాళ్ల ఆట చూడటం ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి. టీ20 ప్రపం చకప్కు ముం దు వీలైనంత ఎక్కువ మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడతారని భావిస్తున్నా ’’ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు మ్యాక్స్ వెల్ వివరించాడు. వచ్చే ఏడాది జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్ కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.