Sports: T10 చరిత్రలో రికార్డు..43 బంతుల్లో 193 పరుగులు చేసిన స్పెయిన్ బ్యాట్స్ మెన్

Sports: Record in T10 history..193 runs in 43 balls by Spain batsmen
Sports: Record in T10 history..193 runs in 43 balls by Spain batsmen

T10 చరిత్రలో రికార్డు సాధించాడు స్పెయిన్ బ్యాట్స్ మెన్ హమ్జా సలీందార్.. కేవలం 43 బంతుల్లో 193 పరుగులు చేశాడు. 449 స్ట్రైక్ రేట్‌తో.. అంటే ప్రతి బంతికి 4 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. స్పెయిన్‌లో జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో హమ్జా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో.. టీ10 క్రికెట్ ఫార్మాట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు సృష్టించాడు. మంగళవారం కాటలున్యా జాగ్వార్, సోహల్ హాస్పిటల్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మొదట కాటలున్యాటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ గా బ్యాటింగ్ దిగిన హమ్జా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 10 ఓవర్లలో 257 పరుగులు చేసింది. మొత్తం జట్టు స్కోర్‌లో హమ్జా 75 శాతం స్కోర్ చేశాడు.

హమ్జా ఇన్నింగ్స్‌లో మొత్తం 22 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ10 క్రికెట్ ఫార్మాట్‌లో లూయిస్ డుప్లూయ్ రికార్డును బద్దలు కొట్టాడు. అతని పరుగుల కంటే.. హమ్జా 30 పరుగుల ముందున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 5న హంగరీ తరఫున ఆడిన లూయిస్ 40 బంతుల్లో 163 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. హమ్జా సలీందార్ స్పెయిన్ కు చెందిన క్రికెటర్. అతను.. టీ10 క్రికెట్‌లో 121 మ్యాచ్‌లు ఆడాడు. 34.97 సగటుతో, 232 స్ట్రైక్ రేట్‌తో 3113 పరుగులు చేశాడు. టీ10 ఫార్మాట్‌లో హమ్జా పేరు మీద 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.