భారత క్రికెట్‌కు చేసిన అద్భుత సేవలకు గాను టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుదరదు. జట్టు సారథిగా దేశానికి టీ20 (2007), వన్డే (2011) ప్రపంచకప్‌లు అందించిన మహీకి గౌరవ సూచకంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీసే ధోనీకి భారత్ తరపున చివరి మ్యాచ్. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు అతను రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘అతనో (ధోని) దిగ్గజ ఆటగాడు. భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌కు అతను అందించిన సహకారం
అపారమైంది. అతని సేవలకు గుర్తింపుగా ఏడో నంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది’’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు చెప్పిన తర్వాత అతని జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని మొట్టమొదటిగా దినేశ్ కార్తీక్ డిమాండ్ చేశాడు. మరోవైపు దిగ్గజం సచిన్ జెర్సీ నంబర్ 10ని కూడా ఎవరూ ధరించని సంగతి తెలిసిందే. 2017లో తన వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ పదో నంబర్ జెర్సీ వేసుకోవడంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీసీసీఐ పదో నంబర్ జెర్సీకి వీడ్కోలు పలికింది.