దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు భారత జట్టు కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. కుటుంబంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా తాత్కాలిక విరామం తీసుకుని తిరిగి జట్టుతో చేరిన కోహ్లి సాధన మొదలుపెట్టాడు. ప్రపంచకప్ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకున్న రోహిత్ కూడా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆదివారం వీరిద్దరు నెట్స్లో చెమటోడ్చారు. నెట్స్లో భిన్నమైన పిచ్లపై బౌలర్లను, త్రోలను ఎదుర్కొన్నారు. సాధనలో స్వల్ప విరామాలు తీసుకున్న కోహ్లి, రోహిత్ పెద్దగా మాట్లాడుకోలేదు. ఇద్దరూ బ్యాటింగ్ సాధనపైనే దృష్టి సారించారు. సుమారు 3 గంటల పాటు సాగిన సాధనను చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షించాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయగా.. యశస్వి జైశ్వాల్, శుభ్మన్ గిల్ స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇక పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో నాలుగో బౌలర్గా శార్దూల్ ఠాకూర్ను ఆడించే అవకాశముంది. కాబట్టి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్కే పరిమితం కావొచ్చు .